కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సహించం

0
16

సీఎం కే చంద్రశేఖర్‌రావు కుటుంబంపై మాజీ ఎంపీ మధుయాష్కీ అనుచిత వ్యాఖ్యలను సహించబోమని ఎంపీ బాల్కసుమన్ అన్నారు. ఎంపీ కవితపై మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ సభ్యత, సంస్కారం మరిచి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఆయన మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, మహిళలే తగిన బుద్ధి చెపుతారన్నారు.

దశాబ్దాల కల అయిన పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా ఎంపీ కవిత కృషి చేశారని తెలిపారు. పసుపు రైతుల కోసం స్పైస్ పార్కును కేంద్రం ద్వారా సాధించారన్నారు. కవితకు లభిస్తున్న ప్రజాదరణను చూసి, రాజకీయ భవిష్యత్తు లేదని మధుయాష్కీ భయపడుతున్నారని వ్యాఖ్య నించారు. ప్రాసల కోసం కాకుండా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ స్కామ్‌గ్రెస్ అని ప్రజలు గుర్తించారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. ఓయూను రణరంగంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. విదేశాల్లో సోకులకు పోయి కేసుల్లో ఇరికిన చరిత్ర మధుయాష్కీదని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here