కేరళసీఎం తలకు రూ.కోటి

0
26

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను హత్య చేసిన వారికి రూ.కోటి నగదు బహుమతి ఇస్తానని ఆరెస్సెస్ మధ్యప్రదేశ్ నాయకుడు కుందన్ చంద్రావత్ ప్రకటించారు. ఇటీవల కేరళలో హిందుత్వ సంస్థల కార్యకర్తల హత్యలకు ఆయన ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. విజయన్‌ను ఎవరు అంతమొందించినా రూ.కోటి నగదు బహుమతి అందిస్తానని ఉజ్జయినిలో జరిగిన ఓ ధర్నా కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నగదు బహుమతి చెల్లించేందుకు తన ఆస్తులను ధారపోసేందుకైనా సిద్ధమేనని ప్రతినబూనారు. ఆయన ప్రకటనతో తమకు సంబంధం లేదని ఆరెస్సెస్ తెలిపింది. ఇటువంటి హింసాత్మక చర్యలను తాము ప్రోత్సహించబోమని వివరించింది. దీనిపై పినరాయి విజయన్ స్పందిస్తూ ఇటువంటి బెదిరింపులు తన విధులను నియంత్రించలేవన్నారు. ఇదిలా ఉండగా కేరళ కోజికోడ్ పట్టణం నాదపురంలోని ఆరెస్సెస్ కార్యాలయంపై గురువారం రాత్రి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here