కేజ్రీవాల్‌ మేనల్లుడిని ఏసీబీ అధికారులు అరెస్టు

0
9

అవినీతి కేసులో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మేనల్లుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పీడబ్య్లూడీ కుంభకోణంలో సీఎం మేనల్లుడు వినయ్‌ బన్సాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వినయ్‌.. కేజ్రీవాల్‌ బావ సురేందర్‌ బన్సాల్‌ కుమారుడు. సురేందర్‌ బన్సాల్‌కు రేణు కన్స్‌స్ట్రక్షన్స్‌ పేరుతో కంపెనీ ఉంది. ఈ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు సీఎం కేజ్రీవాల్‌, పీడబ్ల్యూడీ మంత్రి సత్యేంద్రజైన్‌ కలిసి అక్రమంగా కొన్ని కాంట్రాక్టులు కేటాయించారని రోడ్స్‌ యాంటీ కరప్షన్‌ ఆర్గనైజేషన్‌(రాకో) వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా నకిలీ బిల్లులు చూపించి పీడబ్య్లూడీ శాఖ నుంచి నిధులు పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here