కేజ్రీవాల్‌ను ఢిల్లీకి తరిమేయండి

0
15

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు కాంగ్రెస్ లక్ష్యం గా ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. రైతులను ఆకర్షించేలా ప్రసంగించారు.ఆదివారం పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జరిగిన ప్రచారసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో స్థానికేతరుడైన కేజ్రీవాల్ ఒకవేళ అధికారం చేపడితే కష్టాలు తప్పవన్నారు. పొరుగు దేశం పాకిస్థాన్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నదని, ఈ నేపథ్యంలో బలహీన వ్యక్తులు, ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే రాష్ట్రం, దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని తిరిగి అక్కడికే పంపాలని, తొలుత అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అ డుగాలని ప్రధాని కోరారు. పంజాబ్ యువకులు ఉగ్రవాదులు, డ్రగ్స్ బానిసలు అన్న కాంగ్రెస్‌కు చట్టం ద్వారానే గుణపాఠం చెప్పాలన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పంజాబ్‌లో త్వరలో ఇథనాల్ ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటుచేయనున్నట్లు మోదీ తెలిపారు. ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు వ్యతిరేకంగా వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రధాని కొట్టిపారేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చతెచ్చేందుకు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ పంజాబ్‌ను అభివృద్ధి పథాన తీసుకెళ్తున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here