కేజీబీవీ టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణకు కృషి

0
21

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ)లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసులు, వేతనాల క్రమబద్ధీకరణకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం నుంచి కూడా త్వరలో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతులు ఇవ్వాలన్న అంశం గురించి కూడా కేంద్రాన్ని కోరామన్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు వినితి పత్రం అందజేశామన్నారు. గురువారం కేజీబీవీల ప్రత్యేక అధికారుల వార్షిక సమావేశాన్ని నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. వచ్చే వార్షిక పరీక్షలలో 100 శాతం ఫలితాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఇక నుంచి కేజీబీవీలను ఉదయం 8 నుంచి కాకుండా.. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తామన్నారు.

LEAVE A REPLY