కేంద్ర మంత్రి విజయ్‌సాంప్లాకు రాష్ట్ర బీసీ కమిటీ విజ్ఞప్తి

0
21

బీసీల సంక్షేమానికి రావాల్సిన కేంద్ర నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర సామాజిక సంక్షేమశాఖ సహా య మంత్రి విజయ్‌సాంప్లాను రాష్ట్ర బీసీ శాసనసభ, శాసనమండలి సభ్యుల ప్రతినిధి బృం దం కోరింది.

సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభు త్వం వెచ్చిస్తున్న నిధులను వివరించడంతోపాటు సమర్థవంతంగా అమలయ్యేందుకు వీ లుగా కేంద్ర నిధులనూ అందజేయాలని కోరా రు. ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రితో భేటీ తర్వాత కమిటీ చైర్మన్ గంగాధర్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పథకాలన్నీ తెలంగాణకు కూడా వర్తింపజేయాలని కోరినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారని గంగాధర్‌గౌడ్ తెలిపారు. మంగళవారం జాతీయ బీసీ కమిషన్‌తో భేటీ అవుతామన్నారు. ఈ బృందంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు ఫారూక్‌హుస్సేన్, బీ లక్ష్మీనారాయణ ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో చర్చిస్తామన్నారు. ఫ్రీజోన్‌గా ఉన్న హైదరాబాద్‌లో గ్రూప్ వన్ శ్రేణికి చెందిన ఆంధ్ర పోలీసు ఉద్యోగులు తెలంగాణలో తిష్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here