కేంద్ర పరిశీలనకు ముసాయిదా

0
23

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త సెజ్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సెజ్‌ బిల్లును సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను పరిశీలన కోసం కేంద్రానికి పంపింది. ఈ కొత్త బిల్లులో సెజ్‌ల డీనోటిఫికేషన్‌పై విస్తృతమైన, వివరణాత్మక నిబంధనలు పొందుపరిచింది. ఈ చట్టాన్ని ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌) చట్టం- 2016’గా పిలవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఏదైనా సెజ్‌ను డీనోటిఫై చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ (ఎన్‌వోసీ) ఇస్తేనే కేంద్రం దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిబంధనలు పొందుపరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here