కేంద్ర కేబినెట్‌ నిర్ణయం ఎన్సీబీసీ రద్దు

0
18
వెనుకబడిన తరగతులకు తీపి కబురు. వారి దశాబ్దాల పోరాటం ఫలించింది. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమల్లో ఉన్న జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్సీబీసీ)ని రద్దు చేయనుంది. దానితోపాటు జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌ చట్టం 1993ను ఉపసంహరించనుంది. వాటి స్థానంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు జాతీయ కమిషన్‌(ఎన్‌ఎ్‌సఈబీసీ)ను ఏర్పాటు చేయనుంది. దీనికి రాజ్యాంగ బద్ధత కూడా కల్పించనుంది. ఈ మేరకు బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇందుకు వీలుగా ఎన్‌ఎ్‌సఈబీసీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అనంతరం, చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌, ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగబద్ధత ఉంది, కానీ బీసీ కమిషన్‌కు లేదు. తమకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, నిబంధనల ఉల్లంఘన జరిగినా దళితులు, గిరిజనులు ఆయా కమిషన్లకు ఫిర్యాదు చేసుకుంటారు. ఆ కమిషన్‌ బాధితుల పక్షాన నిలుస్తుంది. అన్యాయం చేసిన వారికి సమన్లు జారీ చేస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతరులు ఎవరైనా కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అయితే, బీసీ కమిషన్‌కు ఇటువంటి అధికారాలు లేవు. జాతీయ స్థాయిలో బీసీ కమిషన్‌ అనేది ఒకటి ఉన్నా.. అది కోరల్లేని పాము వంటిది. వాస్తవానికి, ఇంద్రా సహాణీ కేసు ఆధారంగా 1993లో కేంద్రం బీసీ చట్టం తీసుకుచ్చి కేవలం బీసీ కులాల గుర్తింపు, వాటిని జాబితాలో చేర్చే అధికారం మాత్రమే ఇచ్చింది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here