కెరీర్‌ పుష్కరకాలం

0
24

తమన్నా కథానాయికగా కెరీర్‌ ప్రారంభించి పుష్కరకాలం పూర్తయింది. ఇప్పటికీ సక్సెస్‌, ఫెయిల్యూర్‌లతో సంబంధం లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉంది. తన క్రమశిక్షణ, పనిపట్ల అంకితభావమే అందుకు కారణం అంటుంది. ‘‘చిన్నప్పుడు నేను ఏ మనస్తత్వంతో ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నా. సినిమారంగంలోనే కాదు ఎక్కడికెళ్లినా నేను ఇలాగే ఉంటా. పలానా భాష, హీరో, దర్శకుడితోనే చెయ్యాలని ఫిక్స్‌ అవ్వలేదు. మైండ్‌లో ఓ ఆలోచన పెట్టుకుని అక్కడే ఆగిపోలేదు. మంచి కథ అయితే అందులో భాగం కావాలనుకుంటానంతే. ఇప్పటి వరకూ గ్లామర్‌, డీగ్లామర్‌, కమర్షియల్‌ సినిమాల్లో కనిపించాను. ఇకపై కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చెయ్యాలనుకుంటున్నా. నాకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీలేదు. సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నాకున్న ఏకైక పని’ అని చెప్పుకొచ్చింది. ఆమె అవంతికగా నటించిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్ధమౌతోంది.

LEAVE A REPLY