కెనడాలో మసీదుపై ఉగ్రదాడి

0
17

కెనడాలోని క్యూబెక్ నగరంలోని ఓ మసీదుపై ఉగ్రదాడి జరిగింది. కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఆదివారం రాత్రి 7:15 గంటలకు గుర్తు తెలియని సాయుధులు మసీదులోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఇది ఉగ్రదాడేనని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ మసీదును ముస్లిం శరణార్థులకు ఆశ్రయ కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా కూడా వినియోగిస్తున్నారు. ముస్లింలు కూడా కెనడా దేశంలో ముఖ్యమైన భాగస్థులేనని, ఈ అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీస్ విభాగం ప్రతినిధి క్రిస్టీ కొలంబీ మీడియాకు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here