కూలిన పాక్ విమానం – 48 మంది మృతి

0
17

ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పాకిస్థాన్ విమానం అబోటాబాద్ పర్వత ప్రాంతంలో కూలడంతో 48 మంది మరణించారు.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 48 మంది మృత్యువాత పడ్డారు. సాంకేతిక లోపం తలెత్తడంతో భూమిని చేరడానికి ముందే గాలిలోనే విమానం పేలిపోయి మంటల్లో చిక్కుకున్నది. మృతుల్లో ప్రముఖ పాప్‌సింగర్ జునేద్ జమ్‌షెడ్ దంపతులు, ముగ్గురు విదేశీ ప్రయాణికులతోపాటు మొత్తం తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు శిశువులు, ఇద్దరు ఎయిర్‌హోస్టెస్‌లు, ముగ్గురు పైలెట్లు ఉన్నారు.

LEAVE A REPLY