కులాల కుమ్ములాటపై ఫోకస్‌

0
34

రాష్ట్రంలో కుల, మత, వర్గ గొడవలను అదుపునకు 2016లో ప్రత్యేక చొరవ చూపిన పోలీసు శాఖ కొత్త సంవత్సరంలో వీటి కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించిందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కట్టడి చేసినా విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో గంజాయి వ్యవస్థీకృత నేరంగా మారిందన్నారు. 2016లో మహిళలపై నేరాలు, సైబర్‌ క్రైమ్స్‌ పెరిగాయని తెలిపారు. ఆర్థిక నేరాలు పెరిగినా అందులో విలువ తగ్గిందని, అగ్రిగోల్డ్‌ బాధితులకు త్వరలో న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 2016లో జరిగిన నేరాలు, 2017లో పోలీసింగ్‌లో చేపట్టబోయే మార్పులను ఆయన శనివారం విజయవాడలో విలేకర్లకు వివరించారు. కులాలు, వర్గాలు, ప్రాంతాల కుమ్ములాటలు రాష్ట్రంలో అంతర్గతంగా పెరిగే అవకాశం లేకుండా తుంచేందుకు పోలీసు శాఖ ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. కుల గొడవలు, గంజాయి రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌తోపాటు మహిళలపై నేరాలు, సైబర్‌ క్రైమ్స్‌, ఆర్థిక నేరాలు పోలీసుశాఖకు సవాళ్లని చెప్పారు. కొత్త సంవత్సరంలో ఇన్విజిబుల్‌ పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తామని డీజీపీ తెలిపారు. గతం కన్నా కొంతమేర నేరాలు తగ్గాయని చెబుతూ… 2015లో 94,968 నమోదుకాగా 2016లో 94,355 నమోదయ్యాయని అన్నారు. ఆర్థిక నేరాలు పెరిగినా 2015లో రూ.7,505కోట్ల నేరాలు జరగ్గా వాటి విలువ 2016లో రూ.322 కోట్లు మాత్రమే ఉందన్నారు. మహిళలపై 11శాతం నేరాలు పెరిగాయని, వరకట్న హత్యలు, వేధింపులు, లైంగిక వేధింపులు పెరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాలు కొంతమేర పెరిగాయని ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here