కులపిచ్చి అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన నాని!

0
49
ప్రస్తుతం రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో కులపిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక హీరో సినిమా విడుదలైందంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన అభిమానులు చేసే హడావిడి అంతాఇంతా కాదు. తాజాగా హీరో నానిపై ఓ వ్యక్తి కులం గురించి అభియోగాలు మోపాడు.
ఇటీవల స్వర్గీయ ఎన్టీయార్‌ జన్మదినం సందర్భంగా నాని ఓ ట్వీట్‌ పెట్టారు. ‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చ’ని నాని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు కులాభిమానమే కారణమని ఓ వ్యక్తి ఆరోపించాడు. దీనికి నాని ఘాటుగా స్పందించారు. ‘నేనూ మీలాగే తెలుగువాణ్ని. ఎన్టీయార్‌నే కాదు.. చిరంజీవికి కూడా వీరాభిమానిని. పెద్దలను గౌరవించే సంస్కారం ఉన్నవాణ్ని’ అని సమాధానం ఇచ్చారు నాని. దీంతో ఆ వ్యక్తి తన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here