కులం, జాతి, భాష పేరుతో ఓట్లు అడగొద్దు

0
24

మతం, కులం, జాతి, భాష పేరుతో ఓటర్లను ఓట్లు అడగటం అవినీతి కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా ఓట్లు అడగటాన్ని నిషేధించింది. రాజ్యాంగంలోని లౌకిక (సెక్యులర్) విలువలకు అద్దం పట్టేలా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని హితవు పలికింది. మనిషికి దేవుడికి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు పరిమితమైన విషయం. దాంతో రాజ్యానికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. రాజ్యాన్ని, మతాన్ని కలగలుపటానికి రాజ్యాంగం అంగీకరించదు అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం ఈ అంశంపై 4:3 నిష్పత్తితో మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎన్నికల ప్రజాప్రతినిధి పనితీరు పూర్తిగా లౌకిక విలువలతో కూడి ఉండాలని ధర్మాసనం తెలిపింది.

LEAVE A REPLY