కుప్పకూలిన ఇండోనేషియా విమానం

0
23

జకార్తా, డిసెంబర్ 18: ఇండోనేషియాలో సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 13 మంది మృతి చెందారు. పాపువా రాష్ట్రంలోని తిమికా సిటీ నుంచి హెర్కులెస్ సీ – 130 యుద్ధ విమానం ఆదివారం ఉదయం 6.08 గంటలకు మారుమూల పర్వత ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. ఆ వెంటనే 6.09 గంటలకే సంబంధాలు తెగిపోవడంతో ల్యాండయి ఉంటుందని భావించామని ఎయిర్‌ఫోర్స్ అధిపతి అగస్ సుప్రితానా తెలిపారు. కానీ కూలిపోయింద న్నారు. ఈ విమానంలో ముగ్గురు పైలట్లు, ఎనిమిది మంది నిపుణులు, ఒక నేవీగేటర్, ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here