కుట్రపై నిర్ణయం రిజర్వు

0
40

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమాభారతి తదితర 13 మందిపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది. కేసులకు సంబంధించిన అన్ని పక్షాలు మంగళవారంకల్లా లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ఈ కేసులో నిందితులైన వీవీఐపీల విచారణను రాయ్‌బరేలీ కోర్టు నుంచి లక్నో కోర్టుకు బదిలీ చేసే అంశంపైనా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. రాయ్‌బరేలీ కేసులను లక్నోకు బదిలీచేసి, మొత్తం రెండు సెట్ల కేసులపై ఉమ్మడి విచారణ కొనసాగేలా ఆదేశాలిచ్చే అవకాశం ఉందని కూడా వాదనల సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం సంకేతాలిచ్చింది. ఇప్పటికే 25 ఏండ్లు గడిచిపోయినందున, న్యాయప్రయోజనాల దృష్ట్యా రోజువారీ విచారణ ప్రాతిపదికన కాలపరిమితిని కూడా నిర్దేశించనున్నట్లు తెలిపింది. రెండేండ్లలోగా విచారణ పూర్తయ్యేలా చూడాలనుకుంటున్నట్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here