కీపర్‌గా సాహాకే తొలి ప్రాధాన్యం

0
11

వికెట్‌కీపర్‌గా పార్థివ్ పటేల్ కంటే వృద్ధిమాన్ సాహాకే ఎంపికలో తొలి ప్రాధాన్యం ఉంటుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తూ గంగూలీ మంగళవారం వ్యాఖ్యానించాడు. గుజరాత్‌తో జరిగిన ఇరానీ కప్‌లో సాహా అజేయ డబుల్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో రాణించినా..టెస్ట్‌ల్లో సాహా విజయవంతమైన ఆటగాడు. కేవలం గాయం కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. కావున సాహాకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. పార్థివ్ మెరుగైన ఆటగాడైనా..ఇంకా కొన్ని రోజులు వేచిచూడాలి అని గంగూలీ అన్నాడు. అంతకుముందు కూచ్ బీహార్ కప్ గెలిచిన బెంగాల్ అండర్-19 జట్టు ఆటగాళ్లను సన్మానించిన కార్యక్రమంలో క్యాబ్ అధ్యక్షునిగా దాదా పాల్గొన్నాడు.

LEAVE A REPLY