కివీస్‌ 2.. ఆస్ట్రేలియా 0

0
14

పాకిస్థాన్‌పై టెస్టు, వన్డే సిరీస్‌ల్లో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియాను న్యూజిలాండ్‌ దెబ్బ కొట్టింది. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. చివరిదైన మూడో వన్డేలో కివీస్‌ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మొదట సెంచరీ హీరో రాస్‌ టేలర్‌ (107; 101 బంతుల్లో)కు తోడు బ్రౌనీ (63; 78 బంతుల్లో 7×4), శాంట్నర్‌ (38 నాటౌట్‌; 34 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో కివీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ (3/63), ఫాల్క్‌నర్‌ (3/59), హేజిల్‌వుడ్‌ (2/44) సత్తా చాటారు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ (6/33) ధాటికి ఆసీస్‌ తడబడింది. 47 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఫించ్‌ (56; 64 బంతుల్లో 5×4, 2×6), హెడ్‌ (53; 72 బంతుల్లో 5×4), స్టాయినిస్‌ (42; 48 బంతుల్లో 4×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి వన్డేలో కివీస్‌ కేవలం ఆరు పరుగుల తేడాతో నెగ్గగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నెలలో భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ఆడిన చివరి సిరీస్‌ ఇదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here