‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ నటిపై కుక్కల దాడి

0
16

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్రంలో నటించిన కన్నడ నటి పారుల్‌ యాదవ్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆమె ముఖం, మెడ, కాలి భాగాల్లో గాయపరిచాయి. సోమవారం సాయంత్రం ముంబయిలోని తన అపార్టుమెంటు సమీపంలో పారుల్‌ పెంపుడు కుక్కతో సహా నడుస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆరు వీధి కుక్కలు ఆమె పెంపుడు కుక్కపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. తన కుక్కను కాపాడుకోవడానికి ప్రయత్నించిన పారుల్‌ను వీధి కుక్కలు కరిచాయి. దీంతో గాయాలపాలైన ఆమెను కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ సందర్భంగా పారుల్‌ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తలపై మూడు సెంటీమీటర్లలోతు గాటు పడిందని, దీంతో ఆమెకు బుధవారం సర్జరీ చేస్తున్నారని చెప్పారు. పారుల్‌ యాదవ్‌ పలు కన్నడ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కన్నడ రీమేక్‌లో పారుల్‌ యాదవ్‌ను కథానాయికగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY