కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: ప్రకాశ్

0
36

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ తెలిపారు. కాళేశ్వరం కింద ఉన్న బ్యారేజీలు పూర్తయితే సుమారు 40 నుంచి 50 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. ఇరిగేషన్ విషయంలో గత పాలకుల అన్యాయానికి తెరదించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. చనిపోయిన వారి పేరుతో కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకోవాలనుకోవడం సరికాదన్నారు. ప్రాజెక్టులు అడ్డుకునే చర్యలు మంచివి కావన్నారు. విపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్‌ను హైకోర్టు శనివారం కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సుందిల్ల బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం 240 ఎకరాలు సేకరించింది. అయితే భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తున్నారని కోర్టులో వెంకటరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సమీమ్ అఖ్తర్ కొట్టివేశారు. సుందిల్ల బ్యారేజీ పరిధిలోని గోలివాడ గ్రామానికి చెందిన భూములను ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం సేకరించింది. ఇందుకు గానూ రూ. 19 కోట్లు ప్రభుత్వం డిపాజిట్ చేసినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here