కాలుష్యం అంచనాకు పర్యవేక్షక వ్యవస్థ

0
5

రాష్ట్రంలో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడానికి రెండు నెలల్లో పర్యవేక్షక వ్యవస్థ(మానటరింగ్‌ సిస్టం)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమించే, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సచివాలయంలోని అటవీశాఖ, పీసీబీ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాలుష్య శాతం లెక్కింపులో సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంగా కాలుష్య కారక పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పరిశ్రమల్లో మొక్కలు పెంచేలా తరచూ ఆయా కంపెనీలను సందర్శించాలని సూచించారు. మొక్కల పెంపక ంపై ప్రతి నెలా శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనంతరాములును ఆదేశించారు. మొక్కలు పెరుగుదలపై దశలవారీగా వీడియోలు తీయాలని, వాటిని వచ్చే సమావేశాల్లో ప్రదర్శించాలన్నారు. అటవీశాఖలో ఖాళీలభర్తీకి పచ్చజెండా ఊపారు.

LEAVE A REPLY