కార్యాలయం నుంచి బయటికొచ్చిన మమత

0
26

కోల్‌కతా: రాష్ట్రంలోని టోల్‌గేట్ల వద్ద ఆర్మీ మోహరించడాన్ని నిరసిస్తూ రోజంతా కార్యాలయంలోనే గడిపిన పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి కార్యాలయంలోనే ఉన్న ఆమె సుమారు 30 గంటల తర్వాత శుక్రవారం రాత్రి సచివాలయాన్ని వీడి బయటకొచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి సైన్యాన్ని ఉప సంహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించారు.

కాగా..ఈ అంశం శుక్రవారం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ తృణమూల్‌ సహా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని పేర్కొంది. ఇదే అంశంపై సైన్యం కూడా స్పందించింది. మమత ఆరోపణలు నిరాధారమైనవని కొట్టేపారిసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము టోల్‌గేట్ల వద్ద తనిఖీలు చేపట్టామని, దానికి సంబంధించిన పత్రాలను ఆర్మీ విడుదల చేసింది.

LEAVE A REPLY