కార్మికులకు నగదురహిత పద్ధతిలో వేతనం

0
23

వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లించటానికి వీలుగా వేతనాల చెల్లింపు చట్టానికి సవరణలు చేయటానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఆమోదించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతనాల చెల్లింపు చట్టం, 1936లో సవరణలకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు. అయితే, పెద్దనోట్లరద్దుపై పార్లమెంటు సమావేశాలు స్తంభించిపోయిన నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. వేతనాలను రూపాయలు, నాణేల రూపంలో చెల్లించాలని నిర్దేశిస్తున్న వేతనాల చెల్లింపు చట్టం 1936 నాటిది.

LEAVE A REPLY