కానిస్టేబుల్ శ్రీనివాసులుకు శౌర్యచక్ర

0
21

ఉగ్రవాది కత్తితో కడుపులో పొడిచినా, పొట్టలోంచి పేగులు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావం అవుతున్నా లెక్కచేయక ఉగ్రవాదిని వెంబడించి పట్టుకున్న తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం హెడ్‌కానిస్టేబుల్ కే శ్రీనివాసులు.. ప్రతిష్ఠాత్మకశౌర్యచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని శ్రీనివాసులుకు అందజేశారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులు 1998లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరారు. గ్రేహౌండ్స్‌లో, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశారు. కొన్నేండ్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) విభాగంలో పనిచేస్తున్నారు. మరోవైపు, ఇస్లామిక్‌స్టేట్ ఉగ్రవాదసంస్థ సానుభూతిపరులైన కొందరు ఉగ్రవాదులు హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నటంతో వారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గతేడాది జనవరిలో అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదుల ముఠా కార్యకలాపాలపై సీఐ సెల్ దృష్టి పెట్టింది. అరెస్టయిన ఉగ్రవాదులకు గుజరాత్‌కు చెందిన ఆలం జబ్ అఫ్రీద్ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించింది. అప్పటికే అఫ్రీద్‌పై దేశవ్యాప్తంగా దాదాపు 25 పేలుళ్లు, కుట్ర, విద్రోహచర్యలకు పాల్పడిన కేసులు నమోదై ఉన్నాయి. అతడు 2008 నుంచి పరారీలో ఉన్నాడు. అఫ్రీద్ కోసం గాలింపు జరిపిన సీఐ సెల్ అధికారులు… కర్ణాటకలోని పరప్పణ అగ్రహార పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డినాగమంగళం ప్రాంతంలో మెకానిక్ పనులు చేస్తూ నివసిస్తున్నాడని కనుగొన్నారు. అతడ్ని పట్టుకునేందుకు గత ఏడాది జనవరి 23న కానిస్టేబుల్ శ్రీనివాసులుతోపాటు మరో ముగ్గురితో కూడిన బృందాన్ని పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here