కాట్రవల్లి అనే మేనరిజంతో

0
44

సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రంలో కాళకేయుడిగా ఆకట్టుకున్నారు ప్రభాకర్. కాట్రవల్లి అనే మేనరిజంతో తనదైన హాస్యాన్ని పండించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు హాస్య నటుడు అలీ. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం కాళకేయ వర్సెస్ కాట్రవల్లి. శ్రీపురం కిరణ్ దర్శకుడు. వేమూరి నాగేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ సుక్కు సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ ప్రారంభించాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. మోడ్రన్ శ్రీకృష్ణుడిగా ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు అని తెలిపారు.

LEAVE A REPLY