కాజల్‌ కథానాయికత్వం

0
71

కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథలపై ఇటీవల సీనియర్‌ భామలు మక్కువ ప్రదర్శిస్తున్నారు. నటనలో కొత్తదనం ప్రదర్శించేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయనేది వాళ్ల నమ్మకం. అందుకే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. అనుష్క, నయనతారలాంటి కథానాయికలు ఆ కథలతో సంపాదించిన పేరుని చూశాక మిగిలినవాళ్లు కూడా ఆ తరహా చిత్రాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే కాజల్‌ కూడా కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఓ చిత్రం చేయబోతోందని సమాచారం. బాలీవుడ్‌లో సినిమాలు తీసిన ఓ దర్శకుడు కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఓ స్క్రిప్టుని సిద్ధం చేసి నయనతారకి వినిపించినట్టు తెలిసింది. ఆమె ఆ సినిమా చేయడానికి ఒప్పుకొన్నప్పటికీ, చేసే సమయమే లేదట. పలు చిత్రాలు ఒప్పుకోవడంతో ఆమె కాల్షీట్లు పూర్తయిపోయాయి. అందుకే ఆ కథ కాజల్‌ దగ్గరికి వెళ్లిందని తెలిసింది. తన దగ్గరికి అవకాశం రావడంతో కాజల్‌ వెంటనే ఓకే చెప్పేందని తెలిసింది. ప్రస్తుతం కాజల్‌ చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here