కాచీగూడ – గుంటూరు ఏడాది పాటు రైల్వే శాఖ నడిపి ప్రయాణీకుల ఆదరణ లేక రద్దు

0
22

కాచీగూడ – గుంటూరు – కాచీగూడ మధ్యన ఏడాది పాటు రైల్వే శాఖ నడిపి ప్రయాణీకుల ఆదరణ లేక రద్దు చేసిన ఏసీ డబుల్‌ డెక్కర్‌ సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ రైలును వేరొక మార్గంలో పట్టాలెక్కించబోతోన్నది. నిత్యం రద్దీగా ఉండే విశాఖపట్టణం – తిరుపతి మార్గంలో ఈ రైలు రాకపోకలు సాగిం చ నుంది. ఈ నెల 30వ తేదీన రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు పచ్చజెండా ఊపి రైలుని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం రోజున ఈ రైలు నెంబర్‌ 02708గా నిర్ణయించారు. వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి అర్ధరాత్రి 12.10 గంటలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. తిరుగు ప్రయాణంలో నెంబర్‌ 02707గా మారి విశాఖ పట్టణంలో 31వ తేదీ వేకువ జామున 1 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి చేరుకొంటుంది. రెగ్యులర్‌ సర్వీసు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమౌతుంది. ఈ రైలుని వారానికి మూడుసార్లు నడపాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here