కాంగ్రెస్ అభ్యర్థి మియాని డి షిరా విజయం

0
3

మేఘాలయలోని అంపటి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మియాని డి షిరా విజయం సాధించారు. ఆమె మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కుమార్తె. ఆమె గెలుపుతో శాసనసభలో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది.

మేఘాలయలో 60 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం షిరా గెలుపుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్‌పీపీ నేతృత్వంలో ఏర్పాటైంది. ఎన్‌పీపీకి బీజేపీతోపాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. ఎన్‌పీపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

LEAVE A REPLY