కశ్మీర్ మీ అబ్బసొత్తా?

0
14

రావణకాష్టంలా తయారైన కశ్మీర్ సమస్యపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకే చెందాలని వాదించేందుకు భారత్‌కు కశ్మీర్ తండ్రితాతల జాగీరు కాదన్నారు. దమ్ముంటే ఆక్రమిత కశ్మీర్‌ను విడిపించాలని మోదీకి సవాల్ విసిరారు. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీనాబ్ లోయలో శుక్రవారం జరిగిన ఒక సభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ సర్కారుకు దమ్ముంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విడిపించాలని సవాల్ విసిరారు. వారసత్వ ఆస్తిగా పొందేందుకు అదేమీ వ్యక్తిగత ఆస్తి కాదని మండిపడ్డారు. పీవోకేపై పార్లమెంటు తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, క్యా యే తుమ్హారా బాప్‌కా హై? (అదేమైనా మీ అబ్బసొత్తా?) అని నిలదీశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు.

LEAVE A REPLY