కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

0
14

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గాండెర్బర్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలోని హదురా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగిఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సైనికులను చూడగానే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దాంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల వద్ద ఉన్న రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here