కల్తీపాల ముఠా గుట్టు రట్టు

0
20

యూరియా, పామాయిల్‌తో పాలను కల్తీ చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఏ మల్లేశ్‌యాదవ్ స్థానికంగా బంటి, బబ్లూ డెయిరీ ఫాంలను నిర్వహిస్తున్నాడు. తనకు ఉన్న పశువులు రోజూ 40 లీటర్ల పాలిస్తాయి. కానీ అడ్డదారిలో సంపాదించేందుకు అలవాటు పడ్డ మల్లేశ్ యూరియా, పామాయిల్ సాయంతో 40 లీటర్ల పాలను 600 లీటర్లుగా మార్చి వాటిని మదర్, ముకుంద డెయిరీలకేగాక హైదరాబాద్‌లోని స్వీట్‌షాపులకు, హోటళ్లకు, టీస్టాళ్లకు సరఫరా చేస్తున్నాడు. వీటితోపాటు బీ రమేశ్, సీహెచ్ రాజు, రావుపాండు, వీ చంద్రయ్య, యాదగిరిరెడ్డి, మంత్రి శ్రీశైలం, మంత్రి పర్వతాలు, ఒరుగంటి కుమార్ అనే వ్యక్తుల నుంచి కూడా పాలు సేకరించి, కల్తీ చేస్తున్నాడని పోలీస్ దర్యాప్తులో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here