కరెంట్ బిల్లు రూ.8.64లక్షలు..చిరువ్యాపారి ఆత్మహత్య

0
7

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ చిరువ్యాపారి నిండుప్రాణాల్ని బలిగొన్నది. నెలవారీ విద్యుత్ బిల్లు లక్షల్లో రావడంతో హతాశుడైన కూరగాయల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినియోగానికి మించి 400 రెట్లు అధికంగా విద్యుత్ బిల్లు రావడంతోనే చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్‌లో రాసిపెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఔరంగాబాద్‌లోని భరత్‌నగర్‌లోని రెండుగదులతో ఉన్న రేకుల షెడ్డులో జగన్నాథ్ షెల్కే అనే వ్యక్తి తన కుటుంబంతో 20 ఏండ్లుగా నివసిస్తున్నాడు. మార్చి నెల విద్యుత్ బిల్లును చూసి షెల్కే గుండెలు బాదుకున్నాడు. రూ.8.64 లక్షలు కట్టాలంటూ మహారాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ఎమ్మెస్సీడీసీఎల్) బిల్లు పంపింది. ప్రతినెలా చెల్లించే బిల్లుకన్నా 400 రెట్లు అధికంగా ఉండటంతో షెల్కే మనస్తాపానికి గురయ్యాడు.

LEAVE A REPLY