కరుణానిధిని పరామర్శించిన రాహుల్‌

0
37

గొంతు, వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరామర్శకు వచ్చిన రాహుల్‌ గాంధీ అప్పట్లో కరుణానిధిని కలవకుండా వెళ్లిపోవడం.. మిత్రపక్షం డీఎంకే నేతలను అసంతృప్తికి గురి చేసింది. ఈ విషయమై రాహుల్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీటర్‌ అల్ఫోన్స్‌ సైతం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం చెన్నై వచ్చారు. ఉదయం 11.35 గంటలకు వైద్యులను కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వైద్యుల అనుమతితో కరుణను నేరుగా కలిసి పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించి ‘హలో’ చెప్పానని ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరులకు రాహుల్‌ తెలిపారు.

LEAVE A REPLY