కరీంనగర్‌కు 24/7 మంచినీళ్లు

0
27

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక అయిన కరీంనగర్ నుంచి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టినా దిగ్విజయమవుతుందన్న నమ్మకం ఉన్నది. మిషన్‌భగీరథలో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్‌ను 24/7 నీటి సరఫరాకు ఎంపిక చేశాం అని మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. శనివా రం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 73 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని, వీటిలో 23.5 కిలోమీటర్ల పరిధి కలిగిన కరీంనగర్‌ను 24గంటల మంచినీటి సరఫరాకు తొలు త ఎంపిక చేస్తునట్టు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకా రం కార్పొరేషన్ పరిధిలో 3.5 లక్షల జనాభా, 79 వేల కుటుంబాలున్నాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here