కరణ్‌జోహార్‌కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం

0
24

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్‌జోహార్‌కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఈవెంట్‌కు ఆహ్వానం అందింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ క్లోస్టర్స్‌లో జరుగనున్న ఈ ఈవెంట్‌కు కరణ్‌ కల్చరల్ లీడర్ హోదాలో హాజరుకానున్నాడు.

‘అత్యున్నతమైన వేదిక నుంచి నాకు ఆహ్వానం రావడం గొప్ప సత్కారంగా భావిస్తున్నా. ఈవెంట్‌లో మన దేశ సంస్కృతిని, మన భూమి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తానని’ ఈ సందర్భంగా కరణ్ జోహార్ అన్నాడు. ఈ నెల 17 నుంచి 20 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఈవెంట్‌ జరుగనుంది. గతంలో అమితాబ్ బచ్చన్, ఏఆర్‌ రెహమాన్, మల్లికాసారా భాయ్ వంటి ప్రముఖులు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here