‘కన్నయ్య’ పాటలు

0
44

విపుల్ కథానాయకుడిగా నటిస్తూ రూపొందిస్తున్న చిత్రం కన్నయ్య. హర్షిత కథానాయిక. రాజేష్ జాదవ్, కృష్ణంరాజు పగడాల, రవితేజ తిరువాయిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సత్యకాశ్యప్, ఘంటసాల విశ్వనాధ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. చిత్ర ప్రచార చిత్రాన్ని కేంద్రంలోని రా్రష్ట్ర అధికార ప్రతినిథి ఎస్. వేణుగోపాలచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విపుల్ మాట్లాడుతూ ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఓ వినోదాత్మక చిత్రమిది. నా తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా సినిమా ఉంటుంది. జవహర్‌రెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు బలం అన్నారు.

నిర్మాతలలో ఒకరైన రాజేష్‌బాబు జాదవ్ మాట్లాడుతూ అనుకున్నది సాధించే ఓ యువకుడి కథ ఇది. కథ, కథనం ఆకట్టుకుంటుంది. విపుల్ నటన, దర్శకత్వంతో పాటు ఉత్తేజ్, సత్యకృష్ణ, కాశీవిశ్వనాధ్ పాత్రలు పంచే వినోదం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. పాటలు, ప్రచార చిత్రం బాగుందని, తొలి చిత్రమైనా విపుల్ అద్భుతంగా తెరకెక్కించాడని అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, మల్కాపురం శివకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here