కనీసం 80% ప్రజలు సంతృప్తి చెందాలి

0
20

రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా 3 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని యోచిస్తున్నామని, దానికి ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమం ఉంటుందని, ఆ సమయంలో కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి, సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి… ఈ రెండు కలలు సాకారం కావాలనే లక్ష్యంతో అహర్నిశలూ కృషి చేస్తున్నానని, అవి నెరవేరితే అంతకుమించిన ఆనందం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు, కలెక్టర్లు, విభాగాధిపతుల సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. అద్భుతమైన రాజధానిని నిర్మించాల్సి ఉందని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశమన్నారు. పోలవరంతోపాటు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. సంపద సృష్టికి సేవారంగం, పట్టణీకరణ కీలకమైన అంశాలన్నారు. ఎక్కడికక్కడ వర్షపునీటిని భూమిలో ఇంకిపోయేలా చేయడం, నదుల అనుసంధానంతో స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద డ్రెడ్జింగ్‌ కార్పొరేషన ఆఫ్‌ ఇండియా పనులు వచ్చే నెలలోనే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ పనుల కోసం రూ.950 కోట్లను కేంద్రం ఇస్తుందన్నారు. తలసరి ఆదాయం, జీఏవీ తక్కువగా ఉన్న ఆరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here