‘కత్తి’ బహిష్కరణ ఆరు నెలలపాటు నగరంలో ఉండొద్దు

0
8

ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్రంగా స్పందిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భావ వ్యక్తీకరణ పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను ఆరు మాసాలపాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటిం చారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో మరికొన్ని గ్రూపులు రంగంలోకి దిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నాయని, వారికి తామెంత మాత్రం అవకాశం ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

LEAVE A REPLY