కడప, తిరుపతి వాసులకు శుభవార్త..

0
23

కడప: వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి గల్ఫ్‌ దేశాలకు తిరుపతి నుంచి విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, ఖత్తర్‌, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు జీవన భృతి కోసం లక్షలాది మంది వెళ్లి ఉన్నారు. ప్రతి రోజూ వీరు చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 10 విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్‌ దేశాలకు జనవరి మొదటివారం నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఇమిగ్రేషన్ అండ్‌ కస్టమ్స్‌ అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. త్వరలో ఏయే దేశాలకు.. ఏయే సమయాల్లో విమాన సర్వీసులను నడిపే విషయాన్ని వెంటనే ప్రకటించనున్నారు. ప్రధానంగా అత్యధికంగా ప్రవాస భారతీయులున్న కువైత్ దేశానికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

LEAVE A REPLY