కడపలో దారుణం

0
8

కడప జిల్లా కలమల్లలో ఓబులేసు అనే వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితోదాడికి పాల్పడ్డాడు. తల, భుజంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఓబులేసు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది.

LEAVE A REPLY