‘కంబళ’ కోసం ఏకమవుతున్న కర్ణాటక

0
20

జల్లికట్టు నిషేధంపై ఉద్యమించిన తమిళులు విజయం సాధించడంతో, వారి స్ఫూర్తిగా ఇతర రాష్ర్టాల్లోనూ ఉద్యమాలు మొదలయ్యాయి. గతంలో నిషేధానికి గురైన తమ సంప్రదాయ క్రీడలను పునరుద్ధరించాలని డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో కంబళ ఉద్యమానికి సీఎం సహా, రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు.

స్పందించిన సీఎం.. గళమెత్తిన సినీలోకం

జల్లికట్టు ఆర్డినెన్స్ నేపథ్యంలో కంబళపై నిషేధాన్ని ఎత్తివేయాలని కర్ణాటక రాజకీయ, సినీ ప్రముఖులు గళమెత్తుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం మాట్లాడుతూ ఇది కన్నడనాట శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ క్రీడ. కంబళ కొనసాగాలంటే ఆర్డినెన్స్ అవసరమో కాదో సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు. మంగళూరులో మంగళవారం తులునాడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించింది. కంబళ కమిటీలు కర్ణాటకలోని ముద్‌బిద్రిలో ఈనెల 28న భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

LEAVE A REPLY