కంటతడి పెట్టిన ఒబామా..

0
21

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కంటతడిపెట్టారు. అభిమానులు మరొక్కసారి అంటూ నినదించడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష పదవికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు. చివర్లో ‘మేము చేయగలం.. మేము చేశాము’ అని నినదించారు. తన సొంత పట్టణమైన చికాగోలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికన్లు.. విలువల పతనం, జాతివివక్ష తదితర విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ యువత, కృషి, వైవిధ్యం, పారదర్శకత, తెగింపు, పునఃసృష్టిస్తే భవిష్యత్తు మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జాతి వివక్షపై మరింత బలమైన చట్టాలు ఉండాలన్నారు. దీనిలో మన రాజ్యాంగం.. ఆదర్శాలు ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. తనకు అమెరికాపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అమెరికన్లకు పునఃసృష్టి చేసే అచంచలమైన శక్తి ఉందన్నారు. భవిష్యత్తు అమెరికాదే అని స్పష్టం చేశారు. అమెరికా ప్రజాస్వామ్యం పనిచేస్తే ఆ శక్తి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. మన రాజకీయాలు దేశ ప్రజలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. పార్టీలకు, ఆసక్తులకు అతీతంగా సమష్టి ప్రయోజనం కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మనం భయాన్ని పెంచితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనల్ని ఈస్థాయికి తీసుకొచ్చిన విలువలకు పరిరక్షణగా ఉందాం.. అందుకే నేను ముస్లిం అమెరికన్లపై వివక్షను ఏ మాత్రం అంగీకరించను అని పేర్కొన్నారు.అదే సమయంలో అక్కడ ఉన్న వారంతా ‘చివరిగా ఇంకొక్కసారి’ అని కోరడంతో ఒబామా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here