ఓపెనింగ్‌తో నాకు సమస్య లేదు

0
13

ఐపీఎల్‌లో ముంబై తరఫున నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసినంత మాత్రాన చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ దిగడానికి ఎలాంటి సమస్య లేదని రోహిత్‌శర్మ అన్నాడు. ఐపీఎల్ ట్రోఫీతో ముంబైకి చేరుకున్న రోహిత్ సోమవారం మీడియాతో ముచ్చటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు చాలా తేడా ఉంది. జట్టు సమతౌల్యం కోసం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కొస్తానని లీగ్ ప్రారంభానికి ముందే చెప్పాను. ఐపీఎల్ తర్వాత టెస్ట్, వన్డే క్రికెట్‌కు అలవాటు పడటమనేది సమస్యకాదు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని రోహిత్ అన్నాడు.

LEAVE A REPLY