ఓపిక, సహనానికి పర్యాయపదం చటేశ్వర్ పుజార

0
22

ఓపిక, సహనానికి పర్యాయపదం చటేశ్వర్ పుజార. రాంచీలో ఆసీస్ జట్టుతో ముగిసిన మూడో టెస్టులో అత్యధిక బంతులాడిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా ఆడడంలో లోకేశ్, ఆత్మవిశ్వాసానికి కోహ్లీని చూపిస్తే సహనానికి పుజార ట్రేడ్‌మార్క్‌గా నిలుస్తాడు. ఈ సిరీస్‌లో అత్యధికంగా (348) పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంత సహనం, ఓపిక తనకు 13 ఏండ్ల నుంచే అలవడిందని పుజార అన్నాడు. 8 ఏండ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 13 ఏండ్లకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాను. ఇక ఓపిక విషయానికి వస్తే అదంతా నేను పడిన కఠినశ్రమకు గుర్తింపు. నిరంతరం దేశవాళీ క్రికెట్ ఆడడంతో ఇప్పుడు ఫలితం లభిస్తున్నది అని అన్నాడు. జట్టుకు అవసరమైన సందర్భాన్ని బట్టి ఎలా ఆడాలో తనకు తెలుసన్నాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ఎలా సేదతీరుతాడో వివరించాడు.

LEAVE A REPLY