ఒక్క చాన్స్ కోసం పదమూడేళ్లు: చమ్మక్ చంద్ర

0
30

చమ్మక్‌ అనే పదం జబర్దస్త్‌ కోసమే పెట్టారు. జబర్ద్‌స్తకు ముందు ధనరాజ్‌, వేణు, తాగుబోతు రమేష్‌తో కలిసి కామెడీ స్కిట్స్‌ చేసేవాడ్ని. బొమ్మరిల్లు స్కూప్‌ను ‘కొట్టేస్తా మిమ్మల్ని’ అంటూ ‘ఊసరవెల్లి’ చిత్రం ఆడియో రిలీజ్‌లో ఓ స్కిట్‌ చేశాను. అది బాగా క్లిక్‌ అయ్యింది. ఆ టైమ్‌లో మల్లెమాల సంస్థలో కామెడీషో వస్తోందంటే వారి ఆఫీసుకి వెళ్లాను. ధనరాజ్‌, వేణు, రాఘవ, చంటి.. అందరూ నాకంటే సీనియర్స్‌. అప్పటికి వారు బాగా పాపులర్‌. నేను మాత్రం జనాలకి కొత్త ఫేస్‌. అప్పటికే 13 ఏళ్లుగా ఒక్క ఛాన్స్‌ కోసం నానా కష్టాలు పడ్డాను. అయినా అవకాశాలు రాలేదు. నా పెర్ఫార్మెన్స్‌ ఇండస్ట్రీకి పనికిరాదా అని బాధపడిన రోజులవి.

LEAVE A REPLY