ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కడొచ్చాడు చిత్రం నా పుట్టిన రోజుకు మంచి బహుమతిగా నిలుస్తుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. జగపతిబాబు చెల్లెలిగా నా పాత్ర నవ్యరీతిలో సాగుతుంది.విశాల్‌తో తొలిసారి నటించాను. మా ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా అందంగా ఉంటాయి. దిల్చాహతాహే నిను చూసి తమన్నా అంటూ నా పేరును ఉపయోగిస్తూ పాటను రాయడం ఆనందాన్ని కలిగించింది.
డా॥భాగ్యలక్ష్మి రాసిన గీతాలన్ని బాగున్నాయి. హృదయం హృదయం సినిమాలో నా ఫేవరెట్ సాంగ్. అనుబంధాలకు ప్రాధాన్యమిస్తూ దర్శకుడు సురాజ్ ఈ సినిమాను మలిచారు. ప్రస్తుతం బాహుబలి-2లో నటిస్తున్నాను. నా జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం. ఇలాంటి విజువల్ వండర్‌లో నేను ఓ భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఓ తమిళ సినిమాను అంగీకరించాను అని తెలిపింది.