ఒక్కడి ఆదాయం పన్ను.. 21,870 కోట్లు

0
21

దేశంలో శతకోటీశ్వరులు పెరుగుతున్న విషయాన్ని ఇటీవలే ఆక్స్‌ఫాం అనే సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు నూటికి నూరుపాళ్లు నిజమేనని ఆదాయం పన్ను శాఖ తాజా లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. దేశంలోని ఒక వ్యక్తి 2014-15 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆదాయం పన్ను రూ.21,870 కోట్లని ఆదాయం పన్ను శాఖ తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దేశంలోని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చెల్లించే మొత్తంలో ఇది 11శాతం. ఇంకా అనేక ఆసక్తికర అంశాలు ఐటీ లెక్కల్లో కనిపిస్తున్నాయి. దేశంలోని శతకోటీశ్వరుల్లో 64 మంది 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను చెల్లించాల్సిన మొత్తం రూ.1,13, 068 కోట్లుగా ఉంది. అందులో ముగ్గురు వ్యక్తులు తమ వ్యాపార ఆదాయాలు రూ.500 కోట్లకుపైనేనని వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులపై ఆర్జన రూ.500 కోట్లకు పైమాటేనని తేల్చారు. వీరి పేర్లను ఆదాయం పన్ను శాఖ బయటపెట్టలేదు. దేశంలో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులు 3.65 కోట్ల మంది ఉన్నారు. వీరు తమ పన్ను వేయదగిన ఆదాయం రూ.16.5 లక్షల కోట్లుగా ప్రకటించారు. దీనిపై ఆదాయం పన్నుగా రూ.1.91 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here