ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు 6 6 6 6 6 6

0
33

బ్యాట్స్‌మన్‌ ఒక సిక్స్‌ కొడితేనే కేరింతలు కొడతాం.. అలాంటిది ఓవర్లో ఆరు బంతులనూ స్టాండ్స్‌లోకి పంపిస్తే.. సంబరపడిపోతాం! క్రికెట్‌లో ఇది కొత్తేమీ కాకపోయినా చాలా అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలతో అనామక ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా స్టార్లుగా మారిపోతారు. టైమ్స్‌ షీల్డ్‌ బి డివిజన్‌ మ్యాచ్‌లో సాగర్‌ మిశ్రా అనే 23 ఏళ్ల ఆటగాడు ఈ అరుదైన రికార్డునే నమోదు చేసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. ఆర్‌సీఎ్‌ఫతో జరిగిన మ్యాచ్‌లో ఆటకు రెండో రోజైన బుధవారం పశ్చిమ రైల్వేస్‌ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాగర్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ తుషార్‌ కుమార్‌ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాది టోర్నమెంట్‌ రికార్డు నెలకొల్పాడు. దీంతో 46 బంతుల్లోనే 91 పరుగులు సాధించాడు. సాగర్‌ ఎదుర్కొన్న చివరి 11 బంతుల్లో తొమ్మిదింటిని స్టాండ్స్‌లోకి పంపడం విశేషం. సంచలన ఇన్నింగ్స్‌ అనంతరం సాగర్‌ మాట్లాడుతూ.. ‘నేను ఆల్‌రౌండర్‌ను. ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తాను. దాంతో టెయిలెండర్లతో బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చేది. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్‌ అయ్యాను. ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు బాగా బౌలింగ్‌ చేయడంతో క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం పట్టింది’ అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here