ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్‌వన్

0
44

ఈ ఏడాది ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్‌వన్ స్థానంతో ముగించాడు. ఐసీసీ శనివారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ తమిళనాడు స్పిన్నర్ 887 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, జడేజా (879) రెండో ర్యాంక్‌ను సాధించాడు. దీంతో ఒకేసారి ఇద్దరు భారత బౌలర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2లో నిలువడం ఇది రెండోసారి. 1974లో బిషన్ సింగ్ బేడీ, భగవత్ చంద్రశేఖర్ ఈ ఘనత సాధించారు. రంగన హెరాత్ (శ్రీలంక) మూడో ర్యాంక్‌లోకి దూసుకురాగా, స్టెయిన్ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here