ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అశ్విన్‌

0
22

దుబాయ్‌: ఈ ఏడాది అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు గెలుచుకున్నాడు. స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ పేరు మీదున్న ట్రోఫీని అశ్విన్ అందుకోనున్నాడు. గతంలో భార‌త్ త‌ర‌ఫున‌ ద్ర‌విడ్ (2004), స‌చిన్ (2010) ఈ అవార్డు అందుకున్నారు. అంతేకాదు టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు కూడా అశ్విన్‌కే ద‌క్కింది. ఒకే ఏడాది రెండు అత్యుత్త‌మ ఐసీసీ అవార్డులు అందుకున్న రెండో భార‌త క్రికెట‌ర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇక టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయ‌ర్‌లోనూ అశ్విన్ చోటు సంపాదించాడు. టెస్ట్ టీమ్‌లో భార‌త్ త‌ర‌ఫున అశ్విన్ ఒక్క‌డికే చోటు ద‌క్కింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here